Share News

364 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:15 AM

జాతీయ రహదారిపై మండలంలోని మర్రిపాలెం టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం మధ్యాహ్నం వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు 364 కిలోల గంజాయి పట్టుబడింది. దీనిని రవాణా చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. రెండు ఖరీదైన కార్లను సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్‌ స్థానిక పోలీసు స్టేషన్‌లో మీడియాకు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

364 కిలోల గంజాయి పట్టివేత
పట్టుకున్న గంజాయి, నిందితులతో డీఎస్పీ విష్ణుస్వరూప్‌, సీఐ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది

ఏడుగురి అరెస్టు, రెండు కార్లు సీజ్‌

ఏవోబీలో చిత్రకొండ నుంచి పుణెకు రవాణా చేస్తుండగా పట్టుకున్న సబ్బవరం పోలీసులు

సబ్బవరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మండలంలోని మర్రిపాలెం టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం మధ్యాహ్నం వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు 364 కిలోల గంజాయి పట్టుబడింది. దీనిని రవాణా చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. రెండు ఖరీదైన కార్లను సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్‌ స్థానిక పోలీసు స్టేషన్‌లో మీడియాకు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి మీదుగా గంజాయి రవాణా అవుతున్నట్టు సబ్బవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం సీఐ పిన్నింటి రమణ, ఎస్‌ఐలు పి.సింహాచలం, దివ్య, పోలీసు సిబ్బంది మర్రిపాలెం టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో సబ్బవరం వైపు నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న టయోటా ఫార్చ్యునర్‌, మారుతి బ్రెజ్జా కార్లను ఆపి తనిఖీ చేశారు. ఫార్చ్యునర్‌ కారులో 169 గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీని డ్రైవర్‌తోపాటు ఈ వాహనానికి పైలట్‌గా వస్తున్న బ్రెజ్జా కారులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించగా అల్లూరి జిల్లా సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి, అరకులోయ, ఎస్‌.కోట, పెందుర్తి, సబ్బవరం మీదుగా మహారాష్ట్రలోని పుణెకు తరలిస్తున్నట్టు చెప్పారు. వీరితోపాటు మరో వాహనంలో వస్తున్న ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. గంజాయిని తూకం వేసి 363.8 కిలోలు వున్నట్టు నిర్ధారించారు. నిందితుల నుంచి నాలుగు ఆండ్రాయిడ్‌ ఫోన్లు, ఒక కీప్యాడ్‌, రూ.50 వేల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అల్లూరి జిల్లా జీకే వీఽధికి చెందిన సామిరెడ్డి విజయ్‌, చింతపల్లి మండలం లోతుగెడ్డకు చెందిన వంతల హరీశ్‌బాబు, మాడాబత్తుల అరుణకుమార్‌, కొర్రా మహేశ్‌బాబు, ఎన్‌.నారాయణ, సరమండ అనిల్‌కుమార్‌, మహారాష్ట్రకు చెందిన జి.సాగర్‌ శివాజీలను అరెస్టు చేసి అనకాపల్లి కోర్టుకు తరలించారు.

Updated Date - Mar 19 , 2025 | 12:15 AM