రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:59 AM
రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ నిరంతరం ఎగురుతుందని, ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నామని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.

నిరంతరం ఎగిరేలా చూస్తామన్న పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్
గత మూడు వారాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచాం
సాగర్‌నగర్ బీచ్‌ను కూడా అభివృద్ధి చేస్తాం
ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):
రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ నిరంతరం ఎగురుతుందని, ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నామని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. సోమవారం రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్‌ను ఎగురవేసిన అనంతరం ఆయన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ, పర్యాటక శాఖ గత మూడు వారాల్లో బీచ్‌లో మౌలిక వసతులు మెరుగుపరిచిందన్నారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. పార్కింగ్‌కు కూడా అదనపు స్థలం కేటాయించామన్నారు. ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి మాట్లాడుతూ, త్వరలో బీచ్ నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించినా ఎవరు వస్తున్నారు?, ఎలా వస్తున్నారు? తదితర విషయాలను సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షించడానికి టెక్నాలజీ ఉపయోగించుకుంటామన్నారు. సాగర్‌నగర్ బీచ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించి, అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ బాలాజీ, భీమిలి టీడీపీ ఇన్‌చార్జి గంటా రవితేజ, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఏపీటీడీసీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఆర్‌డీ జగదీశ్, జిల్లా పర్యాటక శాఖాధికారి సుధాసాగర్, జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్, తదితరులు పాల్గొన్నారు. బీచ్‌లో పర్యాటకులను కాపాడే వారికి రక్షణ పరికరాలు అందించారు.