నిర్వాసితుల లేఅవుట్ భూములు పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:18 PM
మండలంలోని పెదబోదిగల్లంలో విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం లే అవుట్ ఏర్పాటు చేయనున్న భూములను కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం పరిశీలించారు.

నక్కపల్లి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదబోదిగల్లంలో విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం లే అవుట్ ఏర్పాటు చేయనున్న భూములను కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం పరిశీలించారు. నక్కపల్లి, పెదబోదిగల్లం గ్రామాలకు ఆనుకుని కారిడార్ నిర్వాసితుల కోసం 150 ఎకరాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 40 ఎకరాలు సిద్ధం చేశామని ఆర్డీవో వీవీ రమణ, తహసీల్దార్ నర్సింహమూర్తి చెప్పారు. లే అవుట్‌కు సంబంధించిన మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు.