ఎనిమిది మంది పోలీసులకు ఉగాది పురస్కారాలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:44 AM
ఉగాది పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ సేవా పతకాలకు జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది పోలీసు ఉద్యోగులు ఎంపికయ్యారు. స్పెషల్ బ్రాంచిలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న బి.శ్రీనివాసరావు ఉత్తమ సేవా పతకానికి ఎంపిక కాగా, ఏఆర్ ఇన్‌స్పెక్టర్ ఎల్.మన్మథరావు, ఏఆర్ ఏఎస్‌ఐ కె.భోజరాజు, అనకాపల్లి సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ కేజేఐజీ ప్రదీప్‌కుమార్, అనకాపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పి.సత్యనారాయణ, ఏఆర్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వై.ఆనందరావు, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇ.తవిటినాయుడు, నర్సీపట్నం రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఆర్.రమణ సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని ఎస్పీ తుహిన్‌సిన్హా అభినందించారు.

అనకాపల్లి రూరల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ సేవా పతకాలకు జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది పోలీసు ఉద్యోగులు ఎంపికయ్యారు. స్పెషల్ బ్రాంచిలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న బి.శ్రీనివాసరావు ఉత్తమ సేవా పతకానికి ఎంపిక కాగా, ఏఆర్ ఇన్‌స్పెక్టర్ ఎల్.మన్మథరావు, ఏఆర్ ఏఎస్‌ఐ కె.భోజరాజు, అనకాపల్లి సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ కేజేఐజీ ప్రదీప్‌కుమార్, అనకాపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పి.సత్యనారాయణ, ఏఆర్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వై.ఆనందరావు, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇ.తవిటినాయుడు, నర్సీపట్నం రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఆర్.రమణ సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని ఎస్పీ తుహిన్‌సిన్హా అభినందించారు.