Share News

Amarnath: టీడీపీ సభ్యత్వంపై గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:06 PM

Andhrapradesh: సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు ప్రజలు వద్ద నుంచి ఆధార్ కార్డులు తీసుకొని టీడీపీ సభ్యత్వం నమోదు చేశారని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు. 100 శాతం సభ్యత్వం జరిగిందని మంత్రి లోకేష్ ముచ్చెర్ల గ్రామానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ముచ్చెర్ల గ్రామంలో 600 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేసే ప్రయత్నంలో

Amarnath: టీడీపీ సభ్యత్వంపై గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
Gudivada amarnath

విశాఖపట్నం, జనవరి 4: టీటీడీ సభ్యత్వ నమోదుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పలు విమర్శలు గుప్పించారు. ముచ్చెర్ల గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై అబద్దాలు చెబతున్నారని మండిపడ్డారు. బెదిరించి, మభ్యపెట్టి ప్రజల నుంచి టీడీపీ సభ్యత్వాన్ని నమోదు చేశారని వ్యా్ఖ్యలు చేశారు. ఆ గ్రామంలో టీడీపీ తప్ప వేరేపార్టీలు లేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత్వంపై దొంగలెక్కలు చెబుతున్నారని అన్నారు. ప్రజలకు తెలియకుండానే వారి ఆధార్ కార్డులు తీసుకుని సభ్యత్వాలు నమోదు చేశారని విమర్శించారు. ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధం అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో 1400 మంది ప్రజలు టీడీపీ సభ్యత్వం నమోదయిందని చెప్తున్నారని.. కొన్ని చోట్ల బెదిరించి సభ్యత్వం నమోదు చేశారని ఆరోపించారు. ముచ్చెర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది..ఈ గ్రామంలో వైసీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు లేవా అని ప్రశ్నించారు.


ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ వైసీపీ గెలుచుకుందన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు ప్రజలు వద్ద నుంచి ఆధార్ కార్డులు తీసుకొని టీడీపీ సభ్యత్వం నమోదు చేశారని వ్యాఖ్యలు చేశారు. 100 శాతం సభ్యత్వం జరిగిందని మంత్రి లోకేష్ ముచ్చెర్ల గ్రామానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ముచ్చెర్ల గ్రామంలో 600 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా సభ్యత్వంపై దొంగ లెక్కలు చెబుతున్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


AP Ministers: తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రులు ఏమన్నారంటే..


టీటీడీ లెటర్స్..

మరోవైపు టీటీడీ లెటర్ అమ్ముకునే స్థితికి హోంమంత్రి అనిత పేషి చేరుకుందని విమర్శించారు అమర్నాథ్. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు టీటీడీ లెటర్ గురించి ఏమీ చెపుతారని ప్రశ్నించారు. మంత్రులు నెల వారీగా వసూళ్లు చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ ఆరోపణలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇక వారిలో వణుకే

రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 04 , 2025 | 01:07 PM