Share News

జోరుగా పనసకాయల విక్రయం

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:51 AM

జోరుగా పనసకాయల విక్రయం

జోరుగా పనసకాయల విక్రయం
వ్యాపారులు కోనుగోలు చేసిన పనసకాయలు

- మైదాన ప్రాంత వర్తకులు వచ్చి కొనుగోళ్లు

జి.మాడుగుల, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): మండలంలో పనసకాయల వ్యాపారం జోరందుకుంది. గత కొన్ని రోజులుగా మైదాన ప్రాంతాలకు చెందిన వర్తకులు మండల వ్యాప్తంగా పనసకాయల కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో అనుకున్న సమయానికి పనస పూత లేదు. దీంతో పిందె దశలో ఉన్న పనసకాయలకు సైతం వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కూర పనసకాయలకు మైదాన ప్రాంతాల్లో గిరాకీ ఉండడంతో అనకాపల్లి, రాజమహేంద్రవరం నుంచి కూడా వర్తకులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ పిందె దశలో ఉన్న పనసకాయ రూ.10 నుంచి రూ.15 వరకు ధర పలుకుతోంది.

Updated Date - Apr 04 , 2025 | 12:51 AM