తలసరి ఆదాయంలో వృద్ధి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:50 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలో తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో చెప్పుకోదగిన వృద్ధి కనిపిస్తున్నది. రాష్ట్ర సగటుతో పోలిస్తే, కొన్ని రంగాల్లో వెనుకబడి వున్నప్పటికీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. మంగళవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల తొలిరోజు సదస్సులో అనకాపల్లి జిల్లా ప్రగతి గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.2,73,026గా ప్రకటించారు. వచ్చే ఏడాది ఇది రూ.3,18,821కి వృద్ధి చెందే అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

ఈ ఏడాది రూ.2,73,026
గత ఏడాదితో పోలిస్తే పది శాతం అధికం
రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.3,18,821కి పెరుగుతుందని అంచనా
స్థూల ఉత్పత్తి రూ.51,500 కోట్ల నుంచి రూ.56,908 కోట్లకు పెరుగుదల
కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతి గణాంకాలు వెల్లడి
అనకాపల్లి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలో తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో చెప్పుకోదగిన వృద్ధి కనిపిస్తున్నది. రాష్ట్ర సగటుతో పోలిస్తే, కొన్ని రంగాల్లో వెనుకబడి వున్నప్పటికీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. మంగళవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల తొలిరోజు సదస్సులో అనకాపల్లి జిల్లా ప్రగతి గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.2,73,026గా ప్రకటించారు. వచ్చే ఏడాది ఇది రూ.3,18,821కి వృద్ధి చెందే అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. 2022-23లో జిల్లా తలసరి ఆదాయం రూ.2,17,076 కాగా 2023-24 లో 2,47,377కి పెరిగింది. కాగా స్థూల ఉత్పత్తి 2023-24లో రూ.51,500 కోట్లు ఉండగా 2024-25లో రూ.56,908 కోట్లకు పెరిగింది. రాష్ట్ర జీడీపీలో జిల్లా స్థూల ఉత్పత్తి 3.57 శాతం ఉన్నట్టు వెల్లడించారు.
సంతృప్తికరంగా ప్రజా సమస్యల పరిష్కారం
ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లాలో తొమ్మిది నెలల కాలంలో 45,884 అర్జీలు అందాయి. వీటిలో 90 శాతానికిపైగా పరిష్కరించినట్టు నివేదికలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి జిల్లా 9వర్యాంకులో ఉంది. ప్రభుత్వ పనితీరుపై నిర్వహించిన సర్వేలో జిల్లాకు ఫైవ్ స్టార్ రేటింగ్స్ 19.3 శాతం మంది ఇవ్వగా, 47 శాతం మంది ఒక స్టార్ రేటింగ్ ఇచ్చారు.