Share News

మూఢనమ్మకాలు వీడండి

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:24 PM

చెడుపు, చిల్లంగి వంటి మూఢ నమ్మకాలను వీడాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌ బర్దార్‌ అన్నారు.

మూఢనమ్మకాలు వీడండి
ఆర్‌.డుంబ్రిగుడలో గ్రామస్థులతో మాట్లాడుతూ జిల్లా ఎస్‌పీ అమిత్‌ బర్దార్‌

అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రికి వెళ్లండి

ఇబ్బందికర పరిస్థితులుంటే

పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించండి

జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌

అరకులోయ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): చెడుపు, చిల్లంగి వంటి మూఢ నమ్మకాలను వీడాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌ బర్దార్‌ అన్నారు. శనివారం మండలంలోని లోతేరు పంచాయతీ ఆర్‌.డుంబ్రిగుడ గ్రామంలో గిరిజనుడి సజీవ దహనం ఘటన జరగడంతో పోలీస్‌, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పీ అమిత్‌ బర్దార్‌ మాట్లాడుతూ గ్రామస్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలన్నారు. ఎవరితోనైనా ఇబ్బందికర సమస్యలుంటే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సంప్రందించాలని సూచించారు. ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లలను పాఠశాలకు పంపాలని ఎస్‌పీ అమిత్‌ బర్దార్‌ కోరారు. పిల్లలను పనులకు పంపకూడదన్నారు. అనంతరం మూఢనమ్మకాలు వీడుతామని ఆర్‌.డుంబ్రిగుడ గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాడేరు డీఎస్‌పీ షేక్‌ షహబాబ్‌ అహ్మద్‌, అరకు సీఐ హిమగిరి, తహసీల్దార్‌ ఎంవీఎస్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ గోపాల్‌రావు, ఆసుపత్రి వైద్యబృందం పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:24 PM

News Hub