Share News

మార్కెట్‌ కమిటీలకు కొత్త సారథులు

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:00 AM

జిల్లాలో నర్సీపట్నం, ఎలమంచిలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు కొత్త చైర్మన్‌/ చైర్‌పర్సన్‌లను కూటమి ప్రభుత్వం నియమించింది. నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మాకవరపాలెం మండలం సీనియర్‌ నాయకుడు రుత్తల శేషుకుమార్‌ ఎంపికయ్యారు. టీడీపీ మండల అధ్యక్షుడి, మాకవరపాలెం సర్పంచ్‌గా, జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. దాదాపు 25 ఏళ్ల నుంచి పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించిన అధిష్ఠానం.. ఆయనకు నర్సీపట్నం ఏఎంసీ పదవిని అప్పగించి తగిన న్యాయం చేసిందని స్థానిక టీడీపీ నాయకులు అంటున్నారు. కాగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న శేషుకుమార్‌ కొద్ది రోజుల నుంచి విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మార్కెట్‌ కమిటీలకు కొత్త సారథులు

నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్‌గా రుత్తల శేషుకుమార్‌

ఎలమంచిలి చైర్‌పర్సన్‌గా తట్టా లోవకుమారి

ఒకరు టీడీపీ, మరొకరు జనసేన

నర్సీపట్నం/ అచ్యుతాపురం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నర్సీపట్నం, ఎలమంచిలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు కొత్త చైర్మన్‌/ చైర్‌పర్సన్‌లను కూటమి ప్రభుత్వం నియమించింది. నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మాకవరపాలెం మండలం సీనియర్‌ నాయకుడు రుత్తల శేషుకుమార్‌ ఎంపికయ్యారు. టీడీపీ మండల అధ్యక్షుడి, మాకవరపాలెం సర్పంచ్‌గా, జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. దాదాపు 25 ఏళ్ల నుంచి పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించిన అధిష్ఠానం.. ఆయనకు నర్సీపట్నం ఏఎంసీ పదవిని అప్పగించి తగిన న్యాయం చేసిందని స్థానిక టీడీపీ నాయకులు అంటున్నారు. కాగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న శేషుకుమార్‌ కొద్ది రోజుల నుంచి విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా ఎలమంచిలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా అచ్యుతాపురం మడుతూరు గ్రామానికి తట్టా లోవకుమారి నియమితులయారు. బీఎస్‌సీ, బీఈడీ చదివిన ఆమె జనసేనలో చురుకైన కార్యకర్తగా వున్నారు. ఈమె భర్త శ్రీనివాసరావు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్త అయిన తనకు నియోజకవర్గంస్థాయి నామినేటెడ్‌ పదవి ఇచ్చినందుకు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌కు రుణపడి వుంటానని ఆమె పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని లోవకుమారి అన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:00 AM