Share News

కిలోన్నర గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:14 AM

దువ్వాడ రైల్వే స్టేషన్‌ సమీపంలోని మంగళపాలెం వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఒక కిలో 545 గ్రాముల గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కిలోన్నర గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం

ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన దువ్వాడ పోలీసులు

కూర్మన్నపాలెం (ఆంధ్రజ్యోతి): దువ్వాడ రైల్వే స్టేషన్‌ సమీపంలోని మంగళపాలెం వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఒక కిలో 545 గ్రాముల గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళపాలేనికి చెందిన పాత రౌడీ షీటర్‌ కె.వెంకట మహేశ్‌, వడ్లపూడిలోని సిద్ధార్థనగర్‌కు చెందిన పాత నేరస్థుడైన కుప్పళ్ల వర్ధన్‌, వడ్లపూడికి చెందిన ఆటోడ్రైవర్‌ వనపల్లి మహేశ్‌లు నంబర్‌ ప్లేటు లేని పల్సర్‌ బైకుపై వస్తున్నట్టు అందిన ముందస్తు సమాచారం మేరకు దువ్వాడ రైల్వే స్టేషన్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వీరి వద్ద నుంచి ఒక కిలో 545 గ్రాముల గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌, రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు అరకులో, ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా గుంత కుముడు వద్ద గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి బెంగళూరులోని భాయ్‌ అనే వ్యక్తికి ఎక్కువ రేటుకు విక్రయిస్తుంటారు. అంతేకాక భాయ్‌ వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ను తక్కువ రేటుకు కొనుగోలు చేసి విశాఖ నగరంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి సరకుతో పాటు బైకు, రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. గంజాయి తాగినా, ఎవరైనా అమ్మినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Updated Date - Mar 23 , 2025 | 01:14 AM