Share News

IPL 2025, PBKS vs GT: పంజాబ్ కింగ్స్ హార్డ్ హిట్టింగ్.. రషీద్ ఖాన్ 150 వికెట్లు

ABN , Publish Date - Mar 25 , 2025 | 08:27 PM

ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ మొదటి బ్యాటింగ్‌కు దిగింది. బ్యాటింగ్‌కు అనకూలిస్తున్న పిచ్‌‌పై పంజాబ్ బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు.

IPL 2025, PBKS vs GT: పంజాబ్ కింగ్స్ హార్డ్ హిట్టింగ్.. రషీద్ ఖాన్ 150 వికెట్లు

ఐపీఎల్‌ (IPL 2025)లో మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగుతోంది. బలమైన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది (PBKS vs GT). ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ మొదటి బ్యాటింగ్‌కు దిగింది. బ్యాటింగ్‌కు అనకూలిస్తున్న పిచ్‌‌పై పంజాబ్ బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు.


ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (5) త్వరగానే ఔట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47) త్రుటిలో అర్ధశతకాన్ని మిస్ అయ్యాడు. మంచి జోరు మీదున్న ఆర్యను రషీద్ ఖాన్ గూగ్లీతో బోల్తా కొట్టించాడు. ఇది రషీద్ ఖాన్‌కు ఐపీఎల్‌లో 150వ వికెట్. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 28 బ్యాటింగ్), మార్కస్ స్టోయినిస్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. దీంతో పంజాబ్ ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. గుజరాత్ ఫీల్డర్లు ఇప్పటికే రెండు క్యాచ్‌లు వదిలేయడం కూడా పంజాబ్‌కు కలిసి వస్తోంది.


సాయి కిషోర్ తన వరుస బంతుల్లో ఒమర్జాయ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను అవుట్ చేశాడు. ఇంకా, పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. వీళ్లను గుజరాత్ టైటాన్స్ టీమ్ కంట్రోల్ చేయలేకపోతే మాత్రం విధ్వంసం తప్పదు. ప్రస్తుతానికి చూస్తే పంజాబ్ 200 పరుగులు దాటడం చాలా సులభంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

GT vs PBKS: గుజరాత్ జట్టులో విపరాజ్ నిగమ్ లాంటి చిచ్చర పిడుగు.. తేలికగా తీసుకుంటే పంజాబ్‌కు మూడినట్లే


Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక


Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 08:27 PM