Kunal Kamra: మరో వీడియో విడుదల చేసిన కునాల్ కామ్రా
ABN , Publish Date - Mar 25 , 2025 | 08:14 PM
శివసేన కార్యకర్తల విధ్వంసాన్ని పరోక్షంగా కునాల్ కామ్రా మీడియా ముందు ప్రస్తావిస్తూ.. ''ఇది ట్రయిలర్ మాత్రమే..ముందుంది అసలు సినిమా'' అంటూ ఒక సినిమాలోని పాపులర్ డైలాగ్ చెప్పారు.

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra) మంగళవారంనాడు మరో వీడియో అప్‌లోడ్ చేశారు. తన కామెడీ షో జరిగిన హాబిటేట్ కామెడీ క్లబ్‌ను శివసేన కార్యకర్తలు విధ్వంసం చేస్తున్న విజువల్స్‌కు తన కామెడీ స్పెషల్ నుంచి మరో సెటైరికల్ సాంగ్‌ను జోడించారు.
Ranya Rao: రన్యారావు కేసు మరో మలుపు.. హవాలా సొమ్ముతో బంగారం కొనుగోలు
'హమ్ హోంగే కామ్యాబ్' అనే పాటలోని పదాలను మార్చి 'మహ్ హోంగే కంగాల్' అంటూ పేరడీ సాంగ్ పాడారు. సేన కార్యకర్తలు కుర్చీలు విసురుతూ వీరంగం చేయడం, కామ్రా ఫోటోలు దగ్ధం చేయడం, దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు సిద్ధమవుతుండంటం, మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో విక్టరీ సంకేతాలు చూపుతున్న శివసైనికులు ఈ వీడియోలో కనిపిస్తారు. శివసేన కార్యకర్తల విధ్వంసాన్ని పరోక్షంగా ఆయన మీడియా ముందు ప్రస్తావిస్తూ.. ''ఇది ట్రయిలర్ మాత్రమే..ముందుంది అసలు సినిమా'' అంటూ ఒక సినిమాలోని పాపులర్ డైలాగ్ చెప్పారు.
500 బెదిరింపు కాల్స్
కాగా, తన వ్యాఖ్యలపై స్పందించిన కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని, ఈ వివాదం అనంతరం తనను చంపుతామంటూ సుమారు 500 బెదిరింపు కాల్స్ వచ్చాయని తన సన్నిహితులతో కునాల్ చెప్పినట్టు తెలుస్తోంది. ముంబై పోలీసులు సమన్లు ఇచ్చినప్పటికీ బెదిరింపుల కారణంగా వారం రోజులు గడువు కోరినట్టు ఆయన చెప్పారు. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ అనేది ధనవంతులు, శక్తివంతులకు మాత్రమే కాదని, తనపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా పోలీసులకు, కోర్టులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..