ఎండ తీవ్రతతో జనం విలవిల
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:04 AM
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీక్షణంగా కాస్తున్నది. దీనికితోడు ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు.

నాతవరంలో 40.2 డిగ్రీలు నమోదు
అనకాపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీక్షణంగా కాస్తున్నది. దీనికితోడు ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. అనకాపల్లిలో రద్దీగా వుండే ప్రధాన రహదారులు మధ్యాహ్న సమయంలో జనం సంచారం బాగా తగ్గిపోతున్నది. వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం శుక్రవారం జిల్లాలోని నాతవరం మండలంలో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మాడుగుల మండలంలో 39 డిగ్రీలు, రావికమతంలో 39.2, నర్సీపట్నంలో 38.5, అనకాపల్లిలో 37.8, అచ్యుతాపురంలో 35.1, బుచ్చెయ్యపేటలో 37.8, చీడికాడలో 36.8, చోడవరం 35.8, దేవరాపల్లిలో 36.6, గొలుగొండలో 37.5, కె.కోటపాడులో 35.5, కశింకోటలో 37.1, కోటవురట్లలో 37.4, మాకవరపాలెంలో 38.1, మునగపాకలో 36,6, నక్కపల్లిలో 34.9, పరవాడలో 34.4, పాయకరావుపేటలో 34.6, రాంబిల్లిలో 31.9, రోలుగుంటలో 37.6, ఎస్.రాయవరంలో 35, సబ్బవరంలో 36.3, ఎలమంచిలిలో 34.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.