బెల్లం మార్కెట్ అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:55 AM
స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డు అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి బెల్లం మార్కెట్‌ను ఆమె సందర్శించారు. యార్డులో అందుబాటులో వున్న షెడ్లు, గోదాములు, వినియోగంలో వున్న వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రైతు బజార్ ఏర్పాటు చేసే యోచన
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి టౌన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డు అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి బెల్లం మార్కెట్‌ను ఆమె సందర్శించారు. యార్డులో అందుబాటులో వున్న షెడ్లు, గోదాములు, వినియోగంలో వున్న వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా మార్కెట్ యార్డులో నెలకొన్న సమస్యలు, యార్డు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఈ సందర్భంగా కలెక్టర్‌కు వివరించారు. మార్కెట్ యార్డులో రైతు బజార్‌ను ఏర్పాటు చేస్తే వ్యాపార కేంద్రంగా మారుతుందని, ఈ మేరకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయీషా, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రవికుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శకుంతల, జీవీఎంసీ జోనల్ కమిషనర్ బీవీ రమణ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.