ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:36 PM
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని మండల, పంచాయతీ, గ్రామ స్థాయిల్లో పార్టీ పండుగను సందడిగా జరుపుకున్నాయి.

వాడవాడలా రెపరెపలాడిన పసుపు జె ండా
మారుమూల ప్రాంతాల్లో సైతం సందడిగా పార్టీ పండుగ
పాడేరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని మండల, పంచాయతీ, గ్రామ స్థాయిల్లో పార్టీ పండుగను సందడిగా జరుపుకున్నాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి టీడీపీ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అంతకుముందు జీసీసీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఎన్‌టీఆర్ చిత్రపటానికి కిడారి శ్రావణ్‌కుమార్ నివాళులర్పించగా, మాజీ గిడ్డి ఈశ్వరి తన ఇంటి ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టీడీపీ నేతలు పాండురంగస్వామి, డప్పోడి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. అలాగే టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో పాతపాడేరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే అరకులోయలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని ప్రతి మండల, పంచాయతీ కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లోనూ టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.