భగ్గుమంటున్న భానుడు
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:32 PM
మన్యంలో భానుడు భగ్గుమంటున్నాడు. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

పాడేరులో 38.5 డిగ్రీలు
పాడేరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మన్యంలో భానుడు భగ్గుమంటున్నాడు. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలోని మార్పులతో ఎండలు మాత్రం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం వేళల్లో బయట వెళ్లేందుకు జనం భయపడుతున్నారు. జిల్లా కేంద్రం పాడేరు శనివారం 38.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా కొయ్యూరులో 35.8, పెదబయలులో 35.7, ముంచంగిపుట్టులో 34.4, డుంబ్రిగుడలో 33.4, అరకులోయలో 33.0, హుకుంపేటలో 32.7, జీకేవీధిలో 31.7, అనంతగిరిలో 31.5, చింతపల్లిలో 31.3, జి.మాడుగులలో 30.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.