బైక్‌లను ఢీకొన్న కారు ఇద్దరి మృతి
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:19 AM
ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై మండలంలోని గొడిచెర్ల జంక్షన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి సీఐ కె.కుమారస్వామి తెలిపిన వివరాలిలా వున్నాయి.

మరొకరికి గాయాలు
సత్యవరం నుంచి రేబాక ఆలయం వద్దకు వెళుతుండగా ప్రమాదం
నక్కపల్లి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై మండలంలోని గొడిచెర్ల జంక్షన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి సీఐ కె.కుమారస్వామి తెలిపిన వివరాలిలా వున్నాయి.
పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన కొంతమంది నక్కపల్లి మండలం రేబాక ఆలయం వద్ద మంగళవారం వేడుక పెట్టుకున్నారు. గ్రామానికి చెందిన కీర్తి చక్రరావు (41), గోళ్ల శివ (45) ఒక బైక్‌పైన, కీర్తి రమణ మరో బైక్‌పై సత్యవరం నుంచి రేబాక బయలుదేరారు. గొడిచెర్ల హైవే జంక్షన్ దాటగానే వెనుక నుంచి వస్తున్న కారు, రెండు బైక్‌లను ఢీకొన్నది. ఒక బైక్‌పై వున్న చక్రరావు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన గోళ్ల శివను తుని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందాడు. మరో బైక్‌పై వున్న కీర్తి రమణ గాయపడ్డారు. మరో రెండు నిమిషాలు ప్రయాణిస్తే ఉద్దండపురం హైవే జంక్షన్‌కు చేరుకుని రేబాక రోడ్డులోకి మళ్లేవారు. ఇంతలోనే గొడిచెర్ల జంక్షన్ వద్ద కారు రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. పోలీసులు మృతదేహాలకు నక్కపల్లి ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.