Share News

‘సింహాద్రి’లో కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:56 AM

కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ యెస్సో నాయక్‌ శుక్రవారం సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ)లో పర్యటించారు. తొలుత సింహాద్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) సమీర్‌శర్మ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

‘సింహాద్రి’లో కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి
కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ యెస్సో నాయక్‌కు మొక్క అందజేస్తున్న ఎన్టీపీసీ ఉద్యోగులు. పక్కన సింహాద్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సమీర్‌శర్మ

పలు విభాగాలను పరిశీలించిన శ్రీపాద్‌ యెస్సో నాయక్‌

పరవాడ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) :

కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ యెస్సో నాయక్‌ శుక్రవారం సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ)లో పర్యటించారు. తొలుత సింహాద్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) సమీర్‌శర్మ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ప్లాంట్‌లోని పలు విభాగాలను మంత్రి పరిశీలించారు. పవర్‌ కంట్రోల్‌రూముతోపాటు సోలార్‌ ఫ్లోటింగ్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఈడీ సమీర్‌శర్మ ప్లాంట్‌ పనితీరు గురించి మంత్రికి వివరించారు. సీఎస్‌ఆర్‌ నిధులతో చుట్టుపక్కల గ్రామాల్లో చేపడుతున్న సామాజిక కార్యక్రమాల గురించి తెలియపరిచారు. అనంతరం మంత్రి స్థానిక దీపాంజలి నగర్‌లోని సముద్రిక అతిథిగృహం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జీఎంలు, ఏజీఎంలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:56 AM