గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి: ఎంపీడీవో
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:05 AM
గృహ నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో బి.వెంకటరమణ కోరారు.

వీరఘట్టం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో బి.వెంకటరమణ కోరారు. బుధవారం మండలంలోని గంగంపేటలో నిర్మాణంలో ఉన్న పీఎం జన్‌మన్ పథకంలో మంజూరైన గృహాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా లక్ష రూపాయలు సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఈఈ జి.రవి, ఏఈ కళ్యాణి దుర్గ, గృహ నిర్మాణశాఖ ఏఈ వినోద్‌కుమార్, కార్యదర్శి ఎం.వసంతకుమార్ పాల్గొన్నారు.
ఏడు పంచాయతీ భవనాలు మంజూరు
వీరఘట్టం మండలంలోని ఎం.రాజపురం, కుంబిడి ఇచ్ఛాపురం, పెద గదబ వలస, కుమ్మరిగుంట, కంబరవలస, యు.వెంకంపేట, గాదిలంక పంచాయతీలకు భవనాలు మంజూరయ్యాయని ఎంపీడీవో బి.వెంకటరమణ తెలిపారు. బుధవారం మండలంలోని కుంబిడి ఇచ్ఛాపురంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో భవన నిర్మానానికి 32 లక్షలు చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.వెంకటరమణ, కుంబిడి ఇచ్ఛాపురం సర్పంచ్ గౌరునాయుడు, పంచాయతీ కార్యదర్శి ఎం.వసంతకుమార్ పాల్గొన్నారు.