‘అగ్నివీర్’కు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:14 AM
భారతసైన్యంలో అగ్నివీర్ ఉద్యోగా లకు ఆన్‌లైన్ ద్వారా అభ్యరుల దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యువజన సర్వీసులశాఖాధికారి ఎ.సోమేశ్వరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

పార్వతీపురం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): భారతసైన్యంలో అగ్నివీర్ ఉద్యోగా లకు ఆన్‌లైన్ ద్వారా అభ్యరుల దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యువజన సర్వీసులశాఖాధికారి ఎ.సోమేశ్వరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివాహంకాని పురుష అభ్యర్థులు ఈనెల 12 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తర్వాత అభ్యర్థులు వారి అడ్మిట్ కార్టును డౌన్‌లోడ్ చేసుకుంటే ఆర్మీ ర్యాలీ తేదీ, సమయం తెలుస్తుందన్నారు. ఆన్‌లైన్ పరీక్ష పాసైన వారికి ఆర్మీ ర్యాలీ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారన్నారు.