PM Internship పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:35 PM
Applications Invited for PM Internship రఽపధాన మంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. 21 నుంచి 24 మధ్య వయసున్న నిరుద్యోగులు ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

పార్వతీపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రఽపధాన మంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. 21 నుంచి 24 మధ్య వయసున్న నిరుద్యోగులు ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 500పైగా ప్రముఖ పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం పొందొచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.