Public Welfare ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:45 PM
Priority to Public Welfare ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సచివాలయంలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.

నిమ్మగడ్డి సాగుకు జిల్లా అనుకూలమని కలెక్టర్ వెల్లడి
పార్వతీపురం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సచివాలయంలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. ఏజెన్సీలో మలేరియా నివారించాలని, సేంద్రియ పద్ధతిలో జీడి తదితర పంటలను సాగు చేయాలని సూచించారు. గిరిజన ఉత్పత్తుల పర్యవేక్షణకు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించాలన్నారు. అనంతరం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. నిమ్మగడ్డి సాగుకు జిల్లా అనుకూలమని తెలిపారు. రెండు వేల ఎకరాల్లో సాగుకు అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం వెయ్యి ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దీనితో పాటు రైతులు అంతర పంటలు వేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చన్నారు. గిరిజన ప్రాంతాల్లో అనుకూలమైన ఇంటర్ గ్రాఫ్, కాఫీ సాగుపై దృష్టిసారించాలని కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సదస్సులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.