Araku Coffee పార్లమెంట్‌లో అరకు కాఫీ
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:06 AM
Araku Coffee in Parliament పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిని కేంద్ర మం త్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పీయూష్ గోయల్, జువల్ ఓరాం, కిరణ్ రుజిజుతో పాటు రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయా స్టాల్స్‌లో అరకు కాఫీతో పాటు వివిధ అటవీ ఉత్పత్తులను ప్రదర్శించారు.

పార్వతీపురం, మార్చి24(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిని కేంద్ర మం త్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పీయూష్ గోయల్, జువల్ ఓరాం, కిరణ్ రుజిజుతో పాటు రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయా స్టాల్స్‌లో అరకు కాఫీతో పాటు వివిధ అటవీ ఉత్పత్తులను ప్రదర్శించారు. అనంతరం మంత్రి సంధ్యారాణి ఢిల్లీ నుంచి ఫోన్ ద్వారా మాట్లాడుతూ.. అరకు కాఫీకి ఈ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో స్టాల్స్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గిరిజన సంక్షేమశాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో ఎంపీల సహకారం కూడా మరువలేనిదన్నారు.