షాదీఖానా ఆధునికీకరణకు కృషి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:19 AM
ముస్లిముల అవసరాల కోసం నిర్మించిన షాదీఖానా భవ నంఆధునికీకరించేందుకు ప్రభు త్వ నిధులు, లేదా ఎంపీ నిధుల మంజూరుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే బేబీనాయన హామీ ఇచ్చారు.

బొబ్బిలి మార్చి 26 (ఆంధ్ర జ్యోతి): ముస్లిముల అవసరాల కోసం నిర్మించిన షాదీఖానా భవ నంఆధునికీకరించేందుకు ప్రభు త్వ నిధులు, లేదా ఎంపీ నిధుల మంజూరుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే బేబీనాయన హామీ ఇచ్చారు.బుధవారం స్థానిక షాదీ ఖానాలో హుదాముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 మంది ముస్లిం, ముస్లిమేతర పేద కుటుంబాల వారికి నిత్యావసర స రుకులను పంపిణీ చేశారు. ఈసం దర్భంగా అసోసియేషన్ ప్రతినిధి ఇంతియాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఖబర్‌స్థాన్(శ్మశానభూమి)అభివృద్ధికి నిధులు మంజూ రు,పేదలకు గృహాలు మంజూరుకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో రోటరీ జిల్లా అధ్యక్షుడు జేసీ రాజు,పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, జామియా మసీదు అధ్యక్షు డు బాషా, మదరసా సిరాజుల్ ఉలూమ్ అధ్యక్షుడు అబుల్ కలాం, రియాజ్ ఖాన్, మహ్మద్ రఫీ, బాబ్జీ , కాకల వెంకటరావు, బొత్స అప్పులు పాల్గొన్నారు.
పారిశుధ్యకార్మికుల ఇళ్ల సమస్య పరిష్కరిస్తా
పదిరోజుల్లో పారిశుధ్య కార్మికుల ఇళ్ల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలో పారిశుధ్య కార్మికులకు ఇళ్లు మంజూరు చేయాలని సీఐటీయనాయకుడు పి.శంకరరావు బుధవారం వినతిప త్రం సమర్పించారు. అలాగే నీట్ పరీక్ష రాసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాల నుకునేఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం గడువునుపెంచాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రతినిధులు ఎమ్మెల్యే బేబీనాయనను కోరారు. ఈ మేరకు బుధవారం కళాశాలల ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.