నోరు విప్పి సమాధానం చెప్పలేరా?: పీడీ
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:09 AM
ఉపాధిహామీ పథకం సామా జిక ఆడిట్‌లో సర్వే బృందం ఎత్తి చూపిన తప్పులపై క్షేత్రసహాయకులు నొరు విప్పి సమాధానం చెప్పలేరా? అంటూ డ్వామా పీడీ రామచంద్రరావు మండి పడ్డారు.

సాలూరు రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం సామా జిక ఆడిట్‌లో సర్వే బృందం ఎత్తి చూపిన తప్పులపై క్షేత్రసహాయకులు నొరు విప్పి సమాధానం చెప్పలేరా? అంటూ డ్వామా పీడీ రామచంద్రరావు మండి పడ్డారు. సాలూరు మండలంలో ఏప్రిల్ ఒకటో తేదీ 2023 నుంచి మార్చి 31, 2024వరకు జరిగిన రూ.32.81కోట్ల విలువైన పనులపై బుధవారం ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక (సోషల్‌ఆడిట్ ) జరిగింది. ఈసందర్భంగా సర్వే బృందం ఎత్తిన చూపిన తప్పులపై క్షేత్రసహాయ కులను ప్రశ్నించగా అందుకు వారు మౌనంగా ఉండడంతో పీడీ మండిపడ్డారు. కరడవలస, నార్లవలస క్షేత్రసహాయకుల తీరును తప్పుపట్టారు.ఉపాధి పథకం లోతప్పులు జరిగే సహించబోనన్నారు.మండలంలో 29పంచాయతీల్లో మస్తర్తపై సంతకాలు, వేలిముద్రల్లేకుండా చెల్లింపులు పలు చోట్ల జరిగినట్టు సర్వే బృందం ఎత్తి చూపింది.ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో మొక్కల్లేకపోవడం, తక్కువ ఉండడం గుర్తించడంతోపాటువాటికి పేమెంట్లు జరిగినట్టు సర్వేబృందం గుర్తిం చింది. సర్వే బృందం ఎత్తి చూపిన పలు తప్పులకు డ్వామా పీడీ రికవరికి సిపారసు చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, స్టేట్ రిసోర్స్‌పర్సన్ దాస్, విజిలెన్స్ అధికారి వెంకటరమణ, ఏపీవో రామకృష్ణ పాల్గొన్నారు.