Share News

Using Technology సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను పట్టుకోవాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:55 PM

Criminals Must Be Caught Using Technology బేసిక్‌ పోలీసింగ్‌ను మర్చిపోకుండా సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను పట్టుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీస్‌ అధికారులు, సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Using Technology సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను పట్టుకోవాలి
మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : బేసిక్‌ పోలీసింగ్‌ను మర్చిపోకుండా సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను పట్టుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీస్‌ అధికారులు, సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, ప్రాపర్టీ, చీటింగ్‌, గంజాయి, తదితర కేసులపై చర్చించారు. పెండింగ్‌ కేసులను త్వరతగతిన పరిష్కరించాలన్నారు. ఈ నేర సమీక్ష మధ్యలో ట్రైనింగ్‌ ఐజీ మోహన్‌రావు వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా పోలీసులకు పలు సూచనలు చేశారు. కళాశాలల పరిధిలో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే వీలైనంత త్వరగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. రైల్వే, ఆర్ఫీఎఫ్‌ సిబ్బంది సహకారంతో గంజాయి రవాణాను అరికట్టాలని సూచించారు. ఒడిశా నుంచి దిగుమతి కాకుండా చూసుకోవాలన్నారు. జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌కు చెందిన నేరస్థులు చైన్‌ స్నాచింగ్‌, మర్డర్‌లకు పాల్పడుతున్నారని, వారిపై పటిష్ఠ నిఘా పెట్టి నేరాలను నియంత్రించాలని తెలిపారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. కర్మయోగి పథకంలో 422 మంది సర్టిఫికెట్‌ తీసుకున్నారన్నారు. పోలీస్‌ స్టేషన్‌ల్లో సీసీటీఎన్‌ఎస్‌కు సంబంధించిన సీడీ ఫైల్‌ అప్‌డేట్‌గా ఉందో లేదో చూస్తున్నామని చెప్పారు. ఈసీఓపీఎస్‌పై అందరూ దృష్టి పెట్టాలని, అల్జర్నేషన్‌ రిపోర్ట్స్‌ సరిగా ఉందో లేదో చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. సీసీ కెమెరాల్లో అనుమానితులుగా గుర్తించిన వారిని పిలిపించి ఆధార్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా ఫొటో తీసుకుని గాంఢీవం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. హెల్మెట్‌ ధారణపై అవగాహన కల్పించి, రోడ్డు భద్రతా నిబంధనులు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:55 PM