Elephants in Gavarammapeta గవరమ్మపేటలో గజరాజులు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:04 AM
Elephants in Gavarammapeta కొద్దిరోజులుగా గరుగుబిల్లి మండలంలో సంచరించిన ఏనుగులు సోమవారం మధ్యాహ్నం జియ్యమ్మవలస మండలంలో ప్రత్యక్షమయ్యాయి. చింతలబెలగాం - ఎరుకలపేట గ్రామాల మధ్య సంచరించిన ఏనుగులు కాసేపు తోటపల్లి - గుణుపూర్ ప్రధాన రహదారిపై హల్‌చల్ చేశాయి.

జియ్యమ్మవలస, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కొద్దిరోజులుగా గరుగుబిల్లి మండలంలో సంచరించిన ఏనుగులు సోమవారం మధ్యాహ్నం జియ్యమ్మవలస మండలంలో ప్రత్యక్షమయ్యాయి. చింతలబెలగాం - ఎరుకలపేట గ్రామాల మధ్య సంచరించిన ఏనుగులు కాసేపు తోటపల్లి - గుణుపూర్ ప్రధాన రహదారిపై హల్‌చల్ చేశాయి. దీంతో వాహన చోదకులు కొంత ఆందోళనకు గురయ్యారు. కొద్ది సేపటి తరువాత గజరాజులు పొలాల్లోకి వెళ్లి అరటి పంటను నాశనం చేశాయి. ప్రస్తుతం గవరమ్మపేట గ్రామ సమీపంలోకి అవి చేరడంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏనుగులను ఇక్కడి నుంచి తరలించి తమకు, పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నారు. మరోవైపు కురుపాం ఫారెస్ట్ రేంజర్ గంగరాజు పర్యవేక్షణలో ట్రాకర్స్ ఏనుగుల సంచారాన్ని పరిశీలిస్తునానరు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.