Share News

Vocational Education Courses వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:41 PM

Focus on Vocational Education Courses టెన్త్‌ తర్వాత విద్యార్థులు వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ తెలిపారు. మంగళవారం పి.కోనవలసలో గిరిజన సంక్షేమ వసతి పాఠశాలను సందర్శించారు

  Vocational Education Courses వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ

పాచిపెంట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): టెన్త్‌ తర్వాత విద్యార్థులు వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ తెలిపారు. మంగళవారం పి.కోనవలసలో గిరిజన సంక్షేమ వసతి పాఠశాలను సందర్శించారు. ఉత్తమ స్థాయికి చేరు కోవాలంటే విద్యార్థులకు పదో తరగతి పునాది అని తెలిపారు. ఇప్పటి నుంచే లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం టెన్త్‌ విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య సూచనలు చేశారు. ఉపయోగకరమైన కోర్సులపై అవగాహన కల్పించారు. పాఠశాలతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం మెనూ అమలు పరిశీలించి.. భోజనాల రుచి చూశారు.

పరీక్షలు బాగా రాయండి

సీతంపేట రూరల్‌: పదో తరగతి పరీక్షలను విద్యార్థులు బాగా రాయాలని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సూచించారు. సామరెల్లి గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులు ఉన్నత చదువులను కొనసాగిం చాలని సూచించారు. టెన్త్‌ తర్వాత చదువు ఆపేయరాదన్నారు. ఈ పరిశీలనలో ఏటీడబ్ల్యూవో మంగవేణి, హెచ్‌ఎం భాస్కరరావు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 11:41 PM