Share News

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:30 AM

జిల్లాలో వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 17 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేశారని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారి డా.టి.కనకదుర్గ తెలిపారు.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

పార్వతీపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 17 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేశారని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారి డా.టి.కనకదుర్గ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం డివిజన్‌.. ప్రాజెక్టు, మున్సిపాలిటీ పరిధిలో 2 ఆయా పోస్టులు, సాలూరు ప్రాజెక్టు పరిధిలో 3 ఆయా పోస్టులు, బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్వాడీ కార్యకర్త పోస్టు, 3 ఆయా పోస్టులు, సీతానగరంలో రెండు ఆయా పోస్టులు, పాలకొండ డివిజన్‌.. పాలకొండలో మూడు ఆయా పోస్టులు, భామిని 2, వీరఘట్టం ఒక ఆయా పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తులను మార్చి 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందించాలన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:30 AM