Share News

Psycho Attack: రెచ్చిపోయిన సైకో.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఓ కుటుంబం..

ABN , Publish Date - Mar 23 , 2025 | 10:05 AM

హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. సూర్య ఆస్పత్రి వద్దకు వచ్చిన సైకో కాసేపు అటూఇటూ కలియ తిరిగాడు. అనంతరం రాళ్లు, కర్తలతో అక్కడ పార్క్ చేసిన కార్లపై దాడి చేశాడు.

Psycho Attack: రెచ్చిపోయిన సైకో.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఓ కుటుంబం..
Psycho Attack Incident

హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్(Pocharam IT Corridor) సైకో దాడి ఘటన(Psycho Attack Incident)లో ఓ చిన్నారి మృతిచెందింది. శనివారం నాడు రోడ్డుపై వెళ్తున్న పలువురిపై సైకో విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తితో ఇష్టం వచ్చినట్లు గాయపరిచాడు. ఇదే క్రమంలో చిన్నారిపైనా సైకో దాడి చేశాడు.


కత్తితో శరీర భాగాలపై పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాలికను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. అయితే చికిత్సపొందుతూ చిన్నారి ఇవాళ(ఆదివారం) మృతిచెందింది. ఆమె మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారు సమాజంలో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది.


అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న(శనివారం) ఓ సైకో వీరంగం సృష్టించాడు. సూర్య ఆస్పత్రి వద్దకు వచ్చిన సైకో కాసేపు అటూఇటూ కలియ తిరిగాడు. అనంతరం రాళ్లు, కర్తలతో అక్కడ పార్క్ చేసిన కార్లపై దాడి చేశాడు. అతని చేష్టలను చూసిన స్థానికులు, కార్ల యజమానులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ప్యాంట్‌లో దాచుకున్న కత్తిని ఒక్కసారిగా బయటకు తీసిన సైకో.. అందరిపైనా దాడికి తెగబడ్డాడు. కనిపించిన ప్రతి ఒక్కరినీ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.


ఈ ఘటనలో పలువురు యువకులు, మహిళలు, చిన్నారులకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అంతా కలిసి ఎట్టకేలకు సైకోను బంధించారు. తాళ్లతో కట్టేసి స్పృహతప్పి పడిపోయేంతగా కొట్టారు. సమాచారాన్ని వెంటనే పోచారం సీఐ రాజు వర్మకు అందించగా ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గాయపడి చికిత్సపొందుతున్న చిన్నారి మరణించింది. మిగతా బాధితులు చికిత్సపొందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Shahid Diwas: ఘనంగా అమరవీరుల దినోత్సవం.. ఆ ముగ్గురినీ స్మరించుకుంటూ..

Gold and Sliver Prices: పైపైకి ఎగబాకుతున్న గోల్డ్ రేటు.. మార్కెట్ ఎలా ఉందంటే..

Updated Date - Mar 23 , 2025 | 01:17 PM