Oh No! Elephants అమ్మో ఏనుగులు
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:50 PM
Oh No! Elephants గరుగుబిల్లి మండలం గిజబ ప్రాంతంలో నిన్నమొన్నటి వరకు సంచరించిన గజరాజులు మంగళవారం జియ్యమ్మవలస మండలం బాసంగి వైపు పయనమయ్యాయి. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

గరుగుబిల్లి, మార్చి18 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలం గిజబ ప్రాంతంలో నిన్నమొన్నటి వరకు సంచరించిన గజరాజులు మంగళవారం జియ్యమ్మవలస మండలం బాసంగి వైపు పయనమయ్యాయి. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిజబలో చెరకు, అరటి, పామాయిల్ పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఇక బాసంగిలో పంటలు నాశనం కాకముందే వాటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటవీ సిబ్బంది, ట్రాకర్లు గజరాజులను పర్యవేక్షిస్తున్నారు. అవి గ్రామాల వైపు రాకుండా చూస్తున్నారు. నాగావళి నది మార్గం గుండా బాసంగి ప్రాంతానికి చేరుకునేలా చర్యలు చేపట్టారు. అయితే ఏనుగులు గ్రామాలకు తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు.