Healthcare Services మెరుగైన వైద్యసేవలందించాలి
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:39 PM
Providing Better Healthcare Services రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం భామిని, బత్తిలి, బాలేరు పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

భామిని, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం భామిని, బత్తిలి, బాలేరు పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రిజిస్టర్ , ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదుపై ఆరా తీశారు. ఓపీ రికార్డుల్లో ఆరోగ్య తనిఖీలు, చికిత్సా వివరాలు పరిశీలించారు. ల్యాబ్ రికార్డులు, జ్వరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్తహీనత నివారణకు సమష్టి కృషి చేయాలన్నారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రోగుల ఆరోగ్య సమస్యలు స్పష్టంగా తెలుసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలన్నారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైద్యాధికారులు జి.శివకుమార్, సోయల్, రవీంద్ర, దామోదర్, సంతోషిలక్ష్మి తదితరులు ఉన్నారు.