Payments వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:59 PM
rregularities in Salary Payments ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయి. శుక్రవారం పాచిపెంట మండల పరిషత్ కార్యాలయ వద్ద జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఈ విషయం బట్టబయలైంది.

పాచిపెంట, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయి. శుక్రవారం పాచిపెంట మండల పరిషత్ కార్యాలయ వద్ద జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఈ విషయం బట్టబయలైంది. మండలంలోని 28 పంచాయతీలలోనూ మస్తర్లలో వేలిముద్రలు, సంతకాలు లేకుండా వేతనాలు చెల్లించారు. 128 వేతనదారుల పేరిటి సుమారు రూ.1.50 లక్షలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో వారానికి మూడు రోజులు మాత్రమే ఉపాధి పనులు చేయాల్సి ఉండగా వారం రోజులు పనిదినాలుగా నమోదు చేసి వలంటీర్లు వేతనాలు చెల్లించినట్లు తేలింది. ఇకపోతే వివిధ పంచాయతీలలో నాటిన జీడి, మామిడి మొక్కల్లో 75 శాతం నీరు లేక ఎండిపోయాయి. 2023-24లో మండలంలో రూ. 20.82 కోట్ల మేరకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు డ్వామా పీడీ కె.రామచంద్రరావు తెలిపారు. వాటిల్లో ఉపాధి పనులకు రూ. 13.44 కోట్లు, పంచాయతీరాజ్ రూ. 2.69 కోట్లు, ఐటీడీఏ ద్వారా రూ. 4.67 కోట్లు, మెటీరియల్‌కు రూ.7.87 కోట్లు వెచ్చించామని వివరించారు. మస్తర్లపై వేలిముద్రలు, సంతకాలు లేకుండా వేతనాలు చెల్లింపులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఎంపీపీ టి.ప్రమీల, ఎంపీడీవో పాత్రో, ఎస్‌ఆర్‌పీ, డీఆర్‌పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.