Share News

ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:11 AM

రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్‌ చార్జీలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేయాలి
ఏపీఈఆర్సీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

ఏపీ ఈఆర్సీ ఎదుట సీపీఐ నిరసన

కల్లూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్‌ చార్జీలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కల్లూరులోని ఏపీఈఆర్సీ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం ఇస్టానుసారంగా వేసిన యూజర్‌ చార్జీలను తగ్గిస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ మేరకు ఇప్పుడు సెకీ ఒప్పందాన్ని ఉపసంహరించుకుని యూజర్‌ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పీపీఏ ఒప్పందంపై కమిషన్‌ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఏపీఈఆర్సీ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, నాయకులు రామకృష్ణారెడ్డి, గిడ్డమ్మ, శ్రావణి, భారతి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:11 AM