They're Back..! తిరిగొచ్చాయ్..!
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:15 PM
They're Back..! శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప ప్రాంతంలో కొద్ది రోజులుగా సంచరించిన ఏనుగులు శుక్రవారం రాత్రి తిరిగి భామిని మండలం ఘనసర ప్రాంతానికి చేరుకున్నాయి. కీసరలో నీటి ఇంజన్, స్వీట్‌కార్న్, నీలగిరి మొక్కలను ఽధ్వంసం చేశాయి. శనివారం సాయంత్రం ఘనసర ప్రాంతంలో అవి హల్‌చల్ చేయడంతో స్థానికులు, రైతులు బెంబేలెత్తిపోతున్నారు.

భామిని, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప ప్రాంతంలో కొద్ది రోజులుగా సంచరించిన ఏనుగులు శుక్రవారం రాత్రి తిరిగి భామిని మండలం ఘనసర ప్రాంతానికి చేరుకున్నాయి. కీసరలో నీటి ఇంజన్, స్వీట్‌కార్న్, నీలగిరి మొక్కలను ఽధ్వంసం చేశాయి. శనివారం సాయంత్రం ఘనసర ప్రాంతంలో అవి హల్‌చల్ చేయడంతో స్థానికులు, రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గత 20 రోజులుగా పొలం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న తమకు మళ్లీ గజరాజుల బెడద పట్టుకుందని వారు వాపోతున్నారు. మరికొద్ది రోజుల్లో చేతికందనున్న మొక్కజొన్నను అవి నాశనం చేసేస్తాయని రైతులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం వారు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఘనసర, కీసర, కోసలి, తాళాడ ప్రాంతవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు రైతులు, గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నారు. బీట్ అధికారులు కేర్ ట్రాకర్స్ ఏనుగుల సంచారంపై దృష్టిసారించారు. పట్ట నష్టపోయిన రైతులు పరిహారం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు.