పాఠశాలలను విలీనం చేయొద్దు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:32 AM
యూపీ పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలల్లో విలీనం కాకుండా చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి ఎమ్మెల్యే బేబీనాయనను కోరారు.

బొబ్బిలి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): యూపీ పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలల్లో విలీనం కాకుండా చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి ఎమ్మెల్యే బేబీనాయనను కోరారు. ఈ మేరకు సోమవారం బొబ్బిలి కోటలోగల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. జీవో నెంబరు 117ను రద్దు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ప్రసన్నకుమార్, కేశవరావు, రామకృష్ణ తదితురులు పాల్గొన్నారు.