Share News

గంజాయి అక్రమ రవాణాపై నిఘా

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:30 AM

గంజాయి అక్రమ రవాణాపై పూర్తి నిఘా పెట్టామని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు.

గంజాయి అక్రమ రవాణాపై నిఘా


  • డీఎస్పీ భవ్యారెడ్డి

  • కొట్టక్కి చెక్‌పోస్టు తనిఖీ

రామభద్రపురం, మార్చి 24(ఆంధ్ర జ్యోతి): గంజాయి అక్రమ రవాణాపై పూర్తి నిఘా పెట్టామని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని కొట్టక్కి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆమె సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. గంజాయి అక్రమంగా రవాణా చేసినా, వినియోగించి నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి ఎక్కు వగా రవాణా అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చింద ని, ఆ దిశగా నిఘా పెట్టామని తెలిపారు. అనంత రం చెక్‌పోస్టు వద్ద ఉన్న రికార్డులు పరిశీ లించారు. ప్రతిరోజూ ఎన్ని వాహనాలు తనిఖీ చేస్తుంది అడిగి తెలుసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Mar 25 , 2025 | 12:30 AM