ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తే ఊరుకోం
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:33 AM
ఎంఆర్ అగ్రహారం ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఆర్ అల్లాయ్స్ కంపెనీ ఏర్పాటుకు తామంతా సమ్మతమేనని, ఇదే సమయంలో ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తే అంగీకరించేది లేదని మండల పరిధిలోని ఎంఆర్ అగ్రహారం, మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి, ఎం.గదబవలస గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.

తెర్లాం, మార్చి 21 (ఆంరఽధజ్యోతి): ఎంఆర్ అగ్రహారం ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఆర్ అల్లాయ్స్ కంపెనీ ఏర్పాటుకు తామంతా సమ్మతమేనని, ఇదే సమయంలో ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తే అంగీకరించేది లేదని మండల పరిధిలోని ఎంఆర్ అగ్రహారం, మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి, ఎం.గదబవలస గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఎంఆర్ అగ్రహారం పరిధిలోని ఎస్‌ఆర్ అల్లాయ్స్ కర్మాగారం ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. డీఆర్వో శ్రీనివాసమూర్తి, చీఫ్ ఇంజినీర్ ప్రసాదరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, తహసీల్దార్ హేమంత్‌కుమార్, ఎస్‌ఐ సాగర్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో కర్మాగారం ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంఆర్ అగ్రహారం సర్పంచ్ ప్రతినిధి లొట్టి వెంకటరావు, గదబవలస సర్పంచ్ రేగాన సత్యనా రాయణ తదితరులు మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి భంగం కలిగించే చర్యలు లేకపోతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలు చెరువులు, బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదని వారిద్దరు స్పష్టం చేశారు. ప్రధానంగా కర్మాగారంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో కర్మాగారం ఏర్పాటుకు రూ.42.8 కోట్లు వెచ్చిస్తున్నామని, ఇందులో అఽధునాతన టెక్నాలజీ వాడుతున్నామని, కాలుష్యం వెదజల్లే పరిస్థితులు ఎదురు కావని, వ్యర్ధాలు కర్మాగారం ప్రాంగణంలోనే నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని కర్మాగార అధినేత సాగిరాజు స్పష్టం చేశారు.