Share News

US Kid Builds Nuclear Reactor: అణు రియాక్టర్ నిర్మించిన 12 ఏళ్ల బాలుడు.. గిన్నిస్ రికార్డు సొంతం

ABN , Publish Date - Mar 23 , 2025 | 10:15 AM

అమెరికాకు చెందిన 12 ఏళ్ల బాలుడు తన ఇంట్లోనే అణురియాక్టర్ నిర్మించిన గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. అతడి ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

US Kid Builds Nuclear Reactor: అణు రియాక్టర్ నిర్మించిన 12 ఏళ్ల బాలుడు.. గిన్నిస్ రికార్డు సొంతం

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నారి వయసు 12 ఏళ్లే.. కానీ వయసు చిన్నదైనా తానో చిచ్చర పిడుగని నిరూపించుకున్నాడు. ఈబేలో కొన్న వస్తువులతో ఏకంగా తన ఇంట్లోనే అణురియాక్టర్ నిర్మించాడు. చివరకు గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు.

మెంఫిస్‌కు చెందిన జాక్సన్ ఓస్వాల్ట్ ఈ అద్భుతం సాధించాడు. ఏడేళ్ల క్రితమే ఈ ఫీట్ సాధించినా అసలు తనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందీ ఎక్స్ వేదికగా ఇటీవల పంచుకున్నాడు. 14 ఏళ్ల వయసులో టెడ్ విల్సన్ అనే వ్యక్తి నియంత్రిత విధానంలో ఫ్యూజన్ సాధించిన విషయాన్ని టెడ్ టాక్స్ షోలో తెలుసుకున్న తరువాత జాక్సన్‌కు కూడా ఫ్యూజన్ ఆధారిత అణు రియాక్టర్ నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. 13వ పుట్టిన రోజులోపే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో అహోరాత్రాలు శ్రమించాడు.

Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. కిలో రూ.3 లక్షలు


మొదట అతడు న్యూక్లియన్ ఫ్యూజర్ వెనకున్న సాంకేతికతను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఆ తరువాత ఫ్యూజన్‌ ను సాధించేందుకు అవసరమైన ప్రయోగాత్మక ఫ్యూజర్ నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. అతడికి తల్లిదండ్రులు ఆర్థికంగా అండగా నిలిచారు. ‘‘మొదట వాక్యూమ్ ఛేంబర్ నిర్మించాను. ఆ తరువాత ఈ బే నుంచి థర్మో మాలిక్యులర్ పంప్ కొనుగోలు చేశాను. డ్యూటీరియం ఇంధనాన్ని కూడా తెచ్చుకున్నాను. ఆ తరువాత లోపలి గ్రిడ్‌ను టాంటలమ్‌తో చేశాను’’ అని జాక్సన్ తెలిపాడు.

Also Read: ఏమి జోకు రా నాయనా.. ఫ్రెండ్స్‌కు దాదాపుగా గుండె పోటు తెప్పించావుగా


దాదాపు అన్ని విడిభాగాలను ఈబే నుంచి తెప్పించుకున్నట్టు చెప్పాడు. ‘‘కొన్ని ప్రయోగాల సమయంలో బాగా ఒత్తిడికి లోనయ్యాను. చివరకు లక్ష్యం మేరకు 13వ పుట్టిన రోజుకు ముందే ఫ్యూజన్ సాధించాను. న్యూట్రాన్లు వెలువడటాన్ని గుర్తించాను’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారులు కూడా అతడి ఇంటిని సందర్శించారు. గైగర్ కౌంటర్‌తో అతడి ఇంట్లో రేడియో ధార్మికత ఎంత ఉందో చెక్ చేసుకుని వెళ్లిపోయారు. ఈ క్రమంలో అతడికి గిన్నిస్ రికార్డు కూడా దక్కింది. ఫ్యూజన్ రియాక్షన్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు లభించింది.

Read Latest and Viral News

Updated Date - Mar 23 , 2025 | 10:15 AM