Share News

Indian Origin Woman Murders Son: భారత సంతతి మహిళ దారుణం.. బిడ్డ గొంతు కోసి హత్య

ABN , Publish Date - Mar 23 , 2025 | 10:51 AM

బిడ్డ కస్టడీ కోసం మాజీ భర్తతో పోరాడుతున్న ఓ మహిళ చివరకు కన్నకొడుకు హత్య చేసింది. ఓ హోటల్‌ అతడి గొంతు కోసి చిన్నారిని బలితీసుకుంది. అమెరికాలో ఈ దారుణం జరిగింది.

Indian Origin Woman Murders Son: భారత సంతతి మహిళ దారుణం.. బిడ్డ గొంతు కోసి హత్య
Indian Origin Woman Murders Son

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉంటున్న ఓ భారత సంతతి మహిళ దారుణానికి ఒడిగట్టింది. కన్న బిడ్డనే గొంతు కోసం హత్య చేసింది. బిడ్డ కస్టడీ కోసం మాజీ భర్తపై కోర్టులో కేసు వేసిన ఆమె చివరకు కన్న బిడ్డను కడతేర్చింది. పోలీసుల ఆమెపై కేసు నమోదు చేశారు.

కాలిఫోర్నియాకు చెందిన సరితా రామరాజు 2018లో భర్త నుంచి విడిపోయింది. అయితే, బిడ్డను అప్పుడప్పుడు చూసి వెళుతోంది. ఇటీవల ఆమె ఎప్పటిలాగే కొడుకును చూసేందుకు శాంటా ఆనాకు వచ్చింది. అక్కడ ఓ మోటల్‌లో దిగింది. కొడుకుతో కలిసి డిస్నీల్యాండ్‌ వెళ్లేందుకు టిక్కెట్లు కూడా కొనుగోలు చేసింది. అయితే మార్చి 19న ఆమె బిడ్డను తండ్రికి అప్పగించాల్సి ఉంది. కానీ ఆమె ఊహించని దారుణానికి పాల్పడింది. కొడుకు గొంతు కోసం హత్య చేసి ఆ తరువాత పోలీసులకు స్వయంగా సమాచారం అందించింది.


Also Read: విదేశీ జైళ్లల్లో 10 వేల పైచిలుకు మంది భారతీయులు.. ఎంతమందికి మరణ శిక్ష పడిందంటే..

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడు గదిలోని బెడ్‌పై అచేతనంగా కనిపించాడు. అతడు చనిపోయి అప్పటికే కొన్ని గంటలు అయినట్టు కనిపిస్తోంది. ఘటనా స్థలంలో ఓ భారీ కత్తి కూడా కనిపించిందని పోలీసులు తెలిపారు. ఇక ఆమెకు 26 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆరెంజ్ కౌంటీ జిల్లా అటార్నీ పేర్కొన్నారు.

‘‘తల్లిదండ్రులకు ఒకరిపైమరొకరికి ఉన్న ఆగ్రహం పిల్లల పాలిట శాపంగా మారకూడదు. ఆగ్రహం వ్యక్తుల్ని ఉన్మాదులుగా మారుస్తుంది. మన వాళ్లు ఎవరో గుర్తించలేని స్థితికి చేరుస్తుంది. బిడ్డలకు తల్లిదండ్రులకు మించిన రక్షణ ఎవరూ కల్పించలేరు. తను స్వయంగా ఈ లోకంలోకి తెచ్చిన చిన్నారిని ఆ తల్లి తన చేతులతోనే ఈ లోకాన్ని దాటించడం దారుణం’’ అని వ్యాఖ్యానించారు.


Also Read: స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలి.. అమెరికాలో భారతీయులకు కేంద్రం సూచన

బిడ్డ కస్టడీకి సంబంధించి నిందితురాలు కోర్టులో ఆమె మాజీ భర్తతో పోరాడుతోందని సమాచారం. తనతో చెప్పకుండానే బిడ్డకు సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకొంటున్నారని ఆరోపించింది. మాజీ భర్తకు మాదక ద్రవ్యాల అలవాటు కూడా ఉన్నట్టు ఆరోపించింది. తన బిడ్డ బెంగళూరులో పుట్టి పెరిగినట్టు నిందితురాలి భర్త పేర్కొన్నారు. 2018లో విడాకులు వచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో బిడ్డ కస్టడీని కోర్టు తండ్రికే అప్పగించింది. వర్జీనియాలోని ఫెయిర్‌ ఫ్యాక్స్‌లో నిందితురాలు ఉంటున్నట్టు, కుమారుడు తనతో ఉండాలని ఆమె కోరుకుంటున్నట్టు కూడా కోర్టు డ్యాకుమెంట్స్‌లో ఉంది.

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 10:51 AM