‘కోకో’కు ధరల స్థిరీకరణ పథకం వర్తింపజేయాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:56 AM
కోకో పంటకు ధరల స్థిరీకరణ పథకాన్ని అమలు చేసి, ఆదుకోవాలని కోకో రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయరాయి శివారు గాంధీనగ ర్‌లోని సీతారామ కల్యాణ మండపంలో గురువారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు.

పెదవేగి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : కోకో పంటకు ధరల స్థిరీకరణ పథకాన్ని అమలు చేసి, ఆదుకోవాలని కోకో రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయరాయి శివారు గాంధీనగ ర్‌లోని సీతారామ కల్యాణ మండపంలో గురువారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో గింజల కొనుగోలు సంస్థలు సిండికేట్‌గా మారి, రైతులను ముంచుతు న్నాయని, ఈ సమయంలో ప్రభుత్వమే గింజ లను కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో కోకో సాగు జరుగుతుండగా మనదేశం 20వ స్థానంలో ఉందని, దేశ అవసరాలకు 80శాతం కోకోను దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అంతర్జా తీ య మార్కెట్ ధరకు అనుగుణంగా కిలో రూ.1040కు కొనుగోలు చేసి, ఈ ఏడాది సంస్థ లు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించేశాయని ఆరోపించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లా డుతూ కోకో రైతులు సంఘటితమైతేనే సమస్య లు పరిష్కారమవుతాయన్నారు. సద స్సులో విజయరాయి ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్ర వేత్త డాక్టర్ మాధవీలత, పెదవేగి ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ ఏరియా ఆయిల్‌పామ్ రైతుల సంఘం అధ్యక్షుడు ఉండవల్లి వెంకట్రావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, పలు జిల్లాలనుంచి వచ్చిన రైతులు పర్వతనేని గంగాధరరావు, బొమ్మారెడ్డి రామ చంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు.
24, 25 తేదీల్లో ధర్నా, రాస్తారోకోలు
కోకో గింజల కొనుగోలు సమస్యపై ఈనెల 24,25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా కోకో గింజల కొను గోలు కేంద్రాల ఎదుట ధర్నాలు, రాస్తారో కోలు నిర్వహించాలని ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందించాలని పిలుపునిచ్చారు.