Share News

ప్రభుత్వాలు మారినప్పుడల్లా బైపాస్‌ మారుస్తారా ?

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:50 AM

ప్రభుత్వాలు మారినపుడల్లా బైపాస్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మారుస్తారా ? అని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌ ప్రశ్నించారు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా బైపాస్‌ మారుస్తారా ?

భీమవరం అర్బన్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారినపుడల్లా బైపాస్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మారుస్తారా ? అని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరిలో నిర్మించే బైపాస్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుపై గురువారం గోపాలన్‌ మాట్లాడారు. ‘ఆకివీడు నుంచి దిగమర్రు వరకు కలిపే బైపాస్‌ ఏడె నిమిదేళ్ల క్రితం ఉండి, భీమవరం టౌన్‌, నర్సయ్య అగ్రహారం, విస్సాకోడేరు, పెన్నాడ, నందమూరు మీదుగా వెళుతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి కొంత పని కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆకస్మికంగా అలైన్‌మెంట్‌ మారుస్తూ కొత్త గెజిట్‌ని విడుదల చేశారు. ఆకివీడు, పెదపుల్లేరు, చిన అమిరం, రాయలం, గునుపూడి మీదుగా మళ్లించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు రోడ్డు వేయాలని ఒక నిర్ణయానికి వచ్చి స్థల సేకరణ చేసి మార్కింగ్‌ ఇచ్చిన కొన్నేళ్లకు మళ్లీ దానిని మార్చడం వెనుక కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు ఇలా ఎందుకు మార్పు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని గోపాలన్‌ కోరారు.

Updated Date - Mar 21 , 2025 | 12:50 AM

News Hub