Share News

ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:52 AM

రబీలో రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలి

భీమవరం రూరల్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రబీలో రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో కొనుగోళ్లపై సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై గ్రామస్థాయిలో రైతులందరికి పూర్తి అవగాహన కల్పించామని తెలిపారు. కనీస మద్దతు ధర కొనుగోళ్లపై గ్రామస్థాయిలో రైతులందరికీ పూర్తి అవగాహన కల్పించాం. కనీస మద్దతు సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,300, గ్రేడ్‌–ఏ రకం రూ.2,320 మద్దతు ధర కల్పించినట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ముఖ్యంగా తేమ శాతం 17 కన్నా తక్కువ ఉండేటట్లు బాగా ఆరబెట్టి శుద్ధి చేసుకుని రైతు సేవా కేంద్రానికి తీసుకువచ్చే విధంగా శాఖల అధికారులు రైతులందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ టి.శివరాం ప్రసాద్‌, డీఎస్‌వో ఎన్‌.సరోజ, జిల్లా సహకారశాఖ అధికారి ఎం.నాగరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:52 AM