YS Vivekananda Reddy: నా సెల్‌ఫోన్ పోయింది..!
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:27 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అనుచరుడు, ‘వైఎస్ అవినాశ్ యూత్’ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్‌కుమార్‌ను పులివెందుల పోలీసులు విచారించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఫోన్ ఇవ్వాలని పోలీసుల కోరగా, తన వద్ద లేదని పవన్ చెప్పాడు. మరోసారి మార్చి 30న విచారణకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు.

‘అవినాశ్ యూత్’ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్
సునీల్ యాదవ్ ఫిర్యాదుపైపోలీసుల విచారణ
పులివెందుల,మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏ-2 సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అనుచరుడు, ‘వైఎస్ అవినాశ్ యూత్’ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్‌కుమార్‌ను పులివెందుల పోలీసులు విచారించారు. ఇటీవల విడుదలైన ‘హత్య’ సినిమాలో తన తల్లిని కించపరిచేలా చిత్రీకరించారని, వాటిని పవన్‌కుమార్ సహా కొందరు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని సునీల్ యాదవ్ ఫిర్యాదు చేయడం.. పవన్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. మంగళవారం రమ్మని అతడికి 41ఏ నోటీసులివ్వగా.. హాజరు కాలేదు. విచారణ సమయంలో తనను పోలీసులు చిత్రహింసలు పెట్టినట్లు పవన్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి.. తనను టార్చర్ పెడతారన్న భయంతో పవన్ రాలేదని సమాచారం. అయితే బుధవారం రావాలని పోలీసులు నోటీసులివ్వగా, అతడు పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్‌కు వచ్చాడు. పోస్టులు పెట్టడానికి వాడిన మొబైల్ ఫోన్ ఇవ్వాలని పోలీసులు పదేపదే అడిగారు. అది పోయిందని, తన వద్ద లేదని పవన్ చెప్పాడు. అతడిని పంపించి వేశారు. 30న ఇంకోసారి విచారణకు రావాలని చెప్పినట్లు అర్బన్ సీఐ నరసింహులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..