Share News

YSRCP Leaders: మమ్మల్ని కాపాడండి.. మొత్తుకుంటున్న వైసీపీ నేతలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 09:17 PM

గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డవారు.. అతిగా ప్రవర్తించి రెచ్చిపోయిన వారు.. ఒక్కొక్కరిగా జైళ్ల చుట్టూతిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలోని మిగిలిన వాళ్లు కంటిమీద కునుకులేకుండా అల్లాడిపోతున్నారు.

YSRCP Leaders: మమ్మల్ని కాపాడండి.. మొత్తుకుంటున్న వైసీపీ నేతలు
YSRCP Leaders

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారమధంతో రెచ్చిపోయి ప్రవర్తించిన వారు కూడా కంటి మీద కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు. నాడు ప్రభుత్వంలో ఉన్నామన్న కండకావురంతో నీఛమైన తప్పులు చేసిన వాళ్లు జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ హయాంలో పేదలకు పంచే బియ్యం దగ్గరినుంచి ప్రతీదాంట్లో అవినీతి జరిగినట్లు కనిపిస్తోంది. అవినీతితో పాటు అన్ని రకాల దారుణాలకు వైసీపీ నాయకులు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. కూటమి ప్రభుత్వం పాత చిట్టాలను బయటకు తీస్తోంది. తప్పులు చేసిన వారి తాట తీస్తోంది. బోరుగడ్డ అనిల్ దగ్గరినుంచి మొదలుకుంటే.. మాజీ మంత్రులు కూడా లబోదిబోమంటున్నారు.


అవినీతి చేపలు

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మెల్లమెల్లగా బయటకు వస్తోంది. పదవిని అడ్డం పెట్టుకుని చిన్న చిన్న గల్లీ నేతల దగ్గరినుంచి మంత్రుల వరకు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి విడుదల రజినిపై ఎసీబీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమాన్యాన్ని విజిలెన్స్‌ తనిఖీల ముసుగులో బెదిరించినట్లు.. వారి నుంచి 2.20 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏసీబీ కేసు నడుస్తోంది. ఈ కేసు లైన్‌లో ఉండగానే.. రజిని మరో కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రజిని, ఆమె మరిది గోపిల అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేశారని.. కుటుంబాన్ని మానసికంగా హింసించారని చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


బూతుల రాయుళ్లు.. దాడుల హీరోలు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంతమంది వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయాలపై, నేతలపై దాడులకు పాల్పడ్డారు. వల్లభనేని వంశీ గన్నవరం తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆయన ఆగడాలు ఆగలేదు.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడైన ఆపరేటర్ సత్యవర్థన్‌ను కిడ్నాప్‌ చేసి, బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి వంశీతో పాటు అతడి అనుచరులపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విషయంలోనే వంశీ గత కొన్ని నెలల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.


టీడీపీ, జనసేన అధినేతలు, వారి కుటుంసభ్యులపై నీఛమైన వ్యాఖ్యలు చేసిన పోసాని క్రిష్ణమురళి, బోరుగడ్డ అనిల్‌లపై కేసులు నమోదయ్యాయి. గత అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. పోసానిని గత నెలలో అరెస్ట్ చేశారు. తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చాడు. సజ్జల ఇచ్చిన స్క్రిఫ్ట్, ప్రోత్సాహంతోనే సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు, కమ్మ సామాజికవర్గంపై అభ్యంతరకరంగా ధూషించానని సినీ నటుడు పోసాని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించిన సజ్జల, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్ట్ గురువారం నాడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఎవ్వరి అండ చూసుకుని వీరంతా విర్రవీగారో.. వాళ్లే సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధిష్టానం మౌనం.. జైళ్ల చుట్టూ తిరుగుతున్నవారిని మరింత బాధిస్తోందని టాక్.


ఇవి కూడా చదవండి:

పరాయి మగాళ్లతో మాట్లాడొద్దన్న భర్త.. కాఫీలో విషం కలిపిచ్చిన భార్య

AP Politics: దువ్వాడ ఆడియో లీక్.. మొత్తం బూతు పురాణమే..

Updated Date - Mar 28 , 2025 | 09:23 PM