Gold and Silver Rates: మహిళలకు బిగ్ షాక్.. జీవితకాల గరిష్ఠానికి బంగారం ధర..
ABN , Publish Date - Jan 25 , 2025 | 07:01 AM
ఢిల్లీలో ఇవాళ(25-01-2025) ఉదయం 06:30 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.75,710కు చేరుకోగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.10 పెరిగి రూ.82,580గా ఉంది.

బిజినెస్ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా బంగారం ధరలు కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్ట్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన పాటిస్తున్న వాణిజ్య పరమైన విధానాలతో గోల్డ్‌కి డిమాండ్ పెరుగుతోందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టాలని భావించే వారు పసిడి వైపు మెుగ్గు చూపడంతో భారీగా డిమాండ్ పెరిగిందని అంటున్నారు. కాగా, నిన్న(శుక్రవారం) ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి 83,100కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇది జీవిత కాల గరిష్ఠ రేటని తెలిపింది.
ఢిల్లీలో ఇవాళ(25-01-2025) ఉదయం 06:30 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.75,710కు చేరుకోగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.10 పెరిగి రూ.82,580గా ఉంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.10 పెరిగి రూ.75,560 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 పెరిగి రూ.82,430కు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే దేశరాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర శుక్రవారం రూ.97,500 ఉండగా.. నేడు రూ.100 పెరిగి రూ.97,600కు చేరుకుంది. అలాగే హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేజీ వెండి నిన్న రూ.1,05,000 ఉండగా.. ఇవాళ రూ.100 పెరిగి రూ.1,05,100గా ఉంది.
దేశవ్యాప్తంగా పసిడి రేట్లు.. (22, 24 క్యారెట్లు)
బెంగళూరు- రూ.75,560, రూ.82,430
చెన్నై-రూ.75,560, రూ.82,430
జైపూర్- రూ.75,710, రూ.82,580
హైదరాబాద్- రూ.75,560, రూ.82,430
కోల్‌కతా- రూ.75,560, రూ.82,430
విజయవాడ- రూ.75,560, రూ.82,430
ఢిల్లీ-రూ.75,710, రూ.82,580
కేరళ- రూ.75,560, రూ.82,430