Amazon: గుడ్ న్యూస్..ఈ ఛార్జీలను తొలగించిన అమెజాన్..
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:28 PM
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటు యూజర్లకు డిస్కౌంట్లు ఇవ్వడంతోపాటు మరోవైపు విక్రయదారులకు కూడా ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ప్రస్తుత రోజుల్లో అనేక మంది వారు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్ లైన్ విధానంలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ (Amazon) వంటి సంస్థల ద్వారా సేల్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వారికి అమెజాన్ ఇండియా తాజాగా గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో రూ.300 కంటే తక్కువ ధర ఉన్న 1.2 కోట్ల ఉత్పత్తులపై రిఫెరల్ ఫీజులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
పెద్ద ఉపశమనం
ఇప్పటివరకు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలు జరిపే ప్రతి విక్రేతకు రిఫెరల్ ఫీజు అనేది ప్రధాన భారంగా ఉండేది. కానీ ఇప్పుడు వారి ఉత్పత్తులు అమ్ముతున్నవారికి ఈ ఫీజును తొలగించడంతో అమెజాన్ ద్వారా అమ్మకాలు చేస్తున్న వ్యాపారాలకు పెద్ద ఉపశమనం కలిగింది. ఈ మార్పుతో విక్రేతలకు, ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు తమ ఉత్పత్తులకు సంబంధించి మరిన్ని లాభాలు రానున్నాయి.
విక్రేతలకు మెరుగైన అవకాశాలు
ఈ కొత్త నిర్ణయం ద్వారా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న విక్రేతలు, చిన్న వ్యాపారాలు, అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో మరింత స్థిరపడేందుకు అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రస్తుతం 135 విభాగాల్లో రిఫెరల్ ఫీజును తొలగించింది. వాటిలో దుస్తులు, బూట్లు, ఫ్యాషన్ ఆభరణాలు, కిరాణా ఉత్పత్తులు, గృహ అలంకరణ, అందం, బొమ్మలు, వంటగది ఉత్పత్తులు, ఆటోమోటివ్ వస్తువులు, పెంపుడు జంతువుల వంటి పలు రకాల ఉత్పత్తులు ఉన్నాయి.
మరోవైపు కస్టమర్లకు కూడా..
అమెజాన్ ఒక కిలో కంటే తక్కువ బరువున్న వస్తువుల నిర్వహణ రుసుములను కూడా తగ్గించింది. ఈ మార్పుతో, విక్రేతలు తక్కువ రుసుము చెల్లించి తమ ఉత్పత్తులను సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో అమెజాన్ ఫ్లాట్ రేట్ షిప్పింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థ ద్వారా, ఉత్పత్తుల బరువు, పరిమాణం లేదా దూరం వంటి అంశాలు కాకుండా, ఒక స్థిరమైన ధరను మాత్రమే వసూలు చేస్తాయి.
ఈ కొత్త రేట్ ఇకపై 75 నుంచి రూ.65కి తగ్గింది. ఇది షిప్పింగ్ ఖర్చులను మరింత తగ్గిస్తుంది. ఈ క్రమంలో రుసుములను తగ్గించడం వల్ల కస్టమర్లకు కూడా తక్కువ ధరలకు ఉత్పత్తులు లభించనన్నాయి. ఈ కొత్త నిర్ణయాలు, కొత్త రుసుములు ఏప్రిల్ 7, 2025 నుంచి అమల్లోకి వస్తాయి.
ఇవి కూడా చదవండి:
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News