Gold Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:00 AM
Gold And Silver Rates: కొన్నాళ్లుగా షాకుల మీద షాకులు ఇస్తున్న బంగారం ఎట్టకేలకు ఊరటను ఇచ్చింది. కొండెక్కిన పసిడి కాస్తా కిందకు దిగొచ్చింది. గోల్డ్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

బంగారం ధరలు కొన్నాళ్లుగా షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి కొండెక్కి కూర్చుంది పసిడి. ఏకంగా రూ.80 వేల మార్క్ దాటేసి గోల్డ్ లవర్స్‌ను భయపెట్టింది. గతేడాది ఆఖరి వరకు బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో కొనేందుకు మహిళలతో పాటు పసిడి ప్రియులు ఎగబడ్డారు. అయితే న్యూ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గోల్డ్ ఆగడం లేదు. తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతోంది. అటు వెండి కూడా రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గి ఊరటను ఇచ్చాయి. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
వెండి తగ్గేదేలే!
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గాయి. 5 రోజుల తర్వాత పసిడి కాస్త దిగొచ్చింది. జనవరి 19వ తేదీ, ఆదివారం నాడు హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.150 మేర తగ్గి.. రూ.74 వేల 350 దగ్గరకు దిగొచ్చింది. అదే 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర ఇవాళ రూ.160 మేర తగ్గి.. 10 గ్రాముల రేటు రూ.81 వేల 110 వద్ద ట్రేడింగ్ అవుతోంది. గోల్డ్ రేట్ తగ్గినా సిల్వర్ రేట్ మాత్రం స్థిరంగానే ఉండటం గమనార్హం. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,04,000 దగ్గర అమ్ముడవుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో ఎలాంటి పన్నులు, చార్జీలు లేవు. వాటిని కలిపితే ప్రాంతాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఆదివారం ఉదయానికి సంబంధించిన రేట్స్ ఇవి. ఒక్కోసారి మధ్యాహ్నానికే ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చే చాన్స్ ఉంటుంది. కావున కొనుగోలు చేసే ముందు స్థానికంగా ధరలు తెలుసుకోవడం ఉత్తమం.
ఇవీ చదవండి:
ఎక్స్ వర్క్స్ కాంట్రాక్టుల్లో ఐటీసీ ఎప్పుడు తీసుకోవాలి ?
సాపిజెన్ బయోలాజిక్స్ ప్లాంట్‌లో సింగపూర్ ప్రెసిడెంట్
మరిన్ని వ్యాపార, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి