Stock Market Update: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:44 PM
ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత వారం వరుసగా ఐదు రోజుల పాటు భారీ స్థాయిలో పెరిగిన భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభం రోజున సైతం అదే తీరు

Stock Markets: ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత వారం వరుసగా ఐదు రోజుల పాటు భారీ స్థాయిలో పెరిగిన భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభం రోజున సైతం అదే తీరు కొనసాగించాయి. మార్కెట్లకు విదేశీ జోష్, ఫెడ్,ఎఫ్‌ఐఐల పెట్టుబడుల బూస్టింగ్ భారీగా ప్రభావం చూపింది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ తర్వాత నుంచి ఏకబిగిన మార్కెట్లు భారీగా పెరిగాయి.
తొలుత మార్కెట్ సెంటిమెంట్ బాగుండడంతో అన్ని ఇండెక్స్ లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,079 పాయింట్లు పుంజుకొని 77,984 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 80వేల మార్క్ ని టచ్ చేయడం ఇవాల్టి ట్రేడింగ్ లో ఒక విశేషం. ఇక, నిఫ్టీ 308 పాయింట్లు ఎగబాకి 23,658 దగ్గర నిలిచింది. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఏకంగా 1,111 పాయింట్లు పెరిగి 51,704 దగ్గర ముగిసింది. ఫిన్ నిఫ్టీ 489 పాయింట్లు పెరిగి 25, 057 దగ్గర ముగియగ, బ్యాంక్ ఎక్స్ భారీగా 1,471 పాయింట్లు పెరిగి 59,644 దగ్గర ముగిసింది.
అటు, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా లాభాల్లోనే ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 85.59 దగ్గర ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని ఇండెక్స్ లను ముందుకు నడిపించాయి. దీంతో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ సూచీలు భారీగా లాభపడ్డాయి. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని ఆయా కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర పెరిగి రూ.418 లక్షల కోట్లకు చేరింది.
ఇవి కూడా చదవండి...
Rajya Sabha : ముస్లిం రిజర్వేషన్ల అంశంపై రాజ్యసభలో రభస
Attack On Bollywood Actress: షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటికి ఊహించని షాక్
Hyderabad Explosion: హైదరాబాద్‌లో భారీ పేలుడు... ఏం జరిగిందంటే
Read Latest Telangana News And Telugu News