Swiss Watches : లగ్జరీ వాచీలకు భలే గిరాకీ
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:58 AM
భారత్‌లో ఖరీదైన వాచీలకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోందని స్విట్జర్లాండ్‌కు చెందిన వాచీల తయారీ సంస్థ బ్రైట్లింగ్ వెల్లడించింది.

బ్రైట్లింగ్ ఇండియా ఎండీ ప్రదీప్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్‌లో ఖరీదైన వాచీలకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోందని స్విట్జర్లాండ్‌కు చెందిన వాచీల తయారీ సంస్థ బ్రైట్లింగ్ వెల్లడించింది. దేశీయంగా కొనుగోలు శక్తి పెరుగుతుండటం, నవతరం కొత్త, ఖరీదైన ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తుండటంతో ఈ మార్కెట్ ఏటా 15 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని బ్రైట్లింగ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ భానోట్ వెల్లడించారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ నుంచి ఏటా రూ.2,500 కోట్ల విలువైన లగ్జరీ వాచీలు దిగుమతి అవుతున్నాయన్నారు. లగ్జరీ వాచీల మార్కెట్లో బ్రైట్లింగ్‌తో పాటు మరో రెండు స్విస్ వాచీ కంపెనీలు కీలకంగా ఉన్నాయన్నారు. లగ్జరీ వాచీ మార్కెట్లో బ్రైట్లింగ్ మార్కెట్ వాటా 10 శాతానికి పైగా ఉందని ప్రదీప్ తెలిపారు.
బ్రైట్లింగ్ వాచీల ధర రూ.3.15 లక్షల నుంచి ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా 2023లో కంపెనీ దేశంలోనే తొలి ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిందన్నారు. ఆ తర్వాత చెన్నై, పుణె, బెంగళూరుకు కార్యకలాపాలను విస్తరించినట్లు ఆయన వివరించారు. కాగా విస్తరణలో భాగంగా వచ్చే ఏడాదిన్నర కాలంలో మరో 6 ఔట్‌లెట్స్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రదీప్ తెలిపారు.

ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

ఆప్షన్ ట్రేడింగ్ అక్కడే కొంప ముంచుతోంది : సెబీ ఛైర్మన్

స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లకు నష్టాలు! కారణం ఇదే
